user-icon Sign In
Go Back

మహానటి ఖాతాలో అరుదైన రికార్డు

Mamatha Sriramula | 09 May 2018

ఈ నెల 9 న మహనటి సినిమా విడుదల అయిన విషయం అందరకి తెల్సినదే కదా... .సినిమా కూడ గొప్ప విజయం అందుకుని Box office లొ దూసుకుపొతోంది.  ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' చిత్రం మూడో వారంలోకి ఎంటరైనప్పటికీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఇంకా అదిరిపోయే వసూళ్లూ సాధిస్తూనే ఉంది. మూడో వారాంతం పూర్తి కావడంతో 19 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో 6వ స్థానంలో నిలిచింది. సాధారణ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంపై ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్ఏ బాక్సాపీసు వద్ద ‘మహానటి' 2.5 మిలియన్ వసూలు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ వైజయంతి మూవీస్ వారు ట్వీట్ చేశారు. సావిత్రమ్మ బాక్సాఫీసును రూల్ చేస్తోంది, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అంటూ అని పేర్కొన్నారు.  
ఇప్పటికే మెగాస్టార్ ఖైదీనంబర్ 150.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ చిత్రాలను కూడా మహానటి దాటేసింది. ఇప్పుడు ఈ చిత్రం కంటే ముందు అత్యధిక వసూళ్లతో.. బాహుబలి.. బాహుబలి2.. రంగస్థలం.. భరత్ అనే నేను.. శ్రీమంతుడు చిత్రాలు ఉన్నాయి. అంటే ఓవర్సీస్ కలెక్షన్స్ టాప్ 6గా మహానటి నిలిచింది. ఇక్కడి నుంచి శ్రీమంతుడు చిత్రం దగ్గరకు వెళ్లేందుకు చాలానే గ్యాప్ ఉండడంతో.. ఆ మార్కును అందుకోవడం కష్టమే కావచ్చు కానీ….మహానటికి ఇలా టాప్6 కు చేరడం కూడా పెద్ద ఘనతగానే చెప్పాలి. …