user-icon Sign In
Go Back

Siri Vennela-An Honour for Padma Shri

Ravi Kumar V | Feb-03-2019
Siri-Vennela-An-Honour-for-Padma-Shri

శివ పూజ కు చివురించిన సిరి వెన్నెలవా

    సిరి వెన్నెలవా..సిరి వెన్నెలవా..

మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా

   సిరి వెన్నెలవా..సిరి వెన్నెలవా..

యతి రాజు కు కృతి పదముల సొబగులనివ్వా  

   సిరి వెన్నెలవా..సిరి వెన్నెలవా..

కవితాంజలి తో బ్రతుకుని తరించనీవా

    సిరి వెన్నెలవా..సిరి వెన్నెలవా..

 

అలుపురెగుక కురిపించు నీ తలపుల వానా

పద జల్లుల తడిసి మేము తరించిపోమా

 

విరచించిన ప్రతి గీతిక ప్రతిసృష్టే కాగా

దివి వదిలి భువి చేరిన విరించివీవా

 

అలుపురెగుక కురిపించు నీ తలపుల వానా

పద జల్లుల తడిసి మేము తరించిపోమా

 

మీగడ తరగల పై తేలిన వెన్నియవై

మీగడ తరగల పై తేలిన వెన్నియవై

మనసును హరించిన తేనియ గీతివా  

 

సినిమా వేదిక పై భారతి పుత్రుడవై

సినిమా వేదిక పై భారతి పుత్రుడవై

శ్రోతల మురిపించే వాక్కులు పంచవా

 

చే కదలిక చైతన్యపు శ్రీకారం కాదా

**మా నిశ్శబ్దపు  హృదయ భావ ప్రతిధ్వనివి కావా

 

శివ పూజ కు చివురించిన సిరి వెన్నెలవా

మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా

యతి రాజు కు కృతి పదముల సొబగులనివ్వా  

 కవితాంజలి తో బ్రతుకుని తరించనీవా

    సిరి వెన్నెలవా..సిరి వెన్నెలవా..

 

తమ బాధల బాధ్యతల కు పాటవిడుపుగా  

       ఆ.. ఆ...ఆ...ఆ.. ఆ...ఆ...

కోయిలకై ఎదురు చూచు జన వాహిని కోర్కెగా

      ఆ.. ఆ...ఆ...ఆ.. ఆ...ఆ...

తరిగిపోని సంపదుంది తమరి మేధస్సున

     ఆ.. ఆ...ఆ...ఆ.. ఆ...ఆ...

మకరందపు చేతి వ్రాలు గ్రోలనీ మమ్మిలా

 

ప్రతిరోజొక నవ గీతిక స్వాగతించగా

వెన్నెల కిన్నెర గానం మాకు తోడుగా

 

అలుపురెగుక కురిపించు నీ తలపుల వానా

పద జల్లుల తడిసి మేము తరించిపోమా

  

లలిత  చరణ కలితం నీ సహజ కవిత్వం

జ్వలిత కవన భరితం సాహిత్య ప్రకాశం

 

నీ కవనపు చంద్రోదయం ప్రసరించిన సిరివెన్నెల

నీ కవనపు చంద్రోదయం ప్రసరించిన సిరివెన్నెల

తెలుగు ప్రజల హృదయం లో నిరతము నిలిచే సహస్ర రేకుల కలువ

 

అలుపురెగుక కురిపించు నీ తలపుల వానా

పద జల్లుల తడిసి మేము తరించిపోమా

విరచించిన ప్రతి గీతిక ప్రతిసృష్టే కాగా

దివి వదిలి భువి చేరిన విరించివీవా

 

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః, స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే

 

**గురువు గారు  పద్మశ్రీ ని వరించిన సందర్భంగా ప్రెస్ మీట్ లో మట్లాడుతూ  I am echo of your silence అన్నారు. ఆ ప్రేరణతో...

 







Recent News