Seasons Greetings
user-icon Sign In
Go Back

HIT, a promising debut of director Dr Shailesh Kolanu

Ravi Kumar V | Mar-30-2020
HIT-a-promising-debut-of-director-Dr-Shailesh-Kolanu

కథ మూడు ముక్కల్లో

హీరో HIT, Homicide Intervention Team లో మర్డర్ కేసులు, మిస్సింగ్ కేసులు ఇన్వెస్టిగేషన్ చేసే ఒక ఎఫిసియెంట్ పోలీస్ ఆఫీసర్, తన జీవితం లో గతం లో జరిగిన సంఘటనల వల్ల ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ తో బాధ పడుతుంటాడు.ఔటర్ రింగ్ రోడ్డు మీద మిస్ అయిన ఒక అమ్మాయి కేసు డీల్ చేస్తున్న హీరోయిన్ మిస్ అవుతుంది. ఆ అమ్మాయి కి ఏమ్ జరిగింది? హీరోయిన్ ఏమయ్యింది? హీరో కేసుని ఎలా ఛేదించాడు అనేది కథ.

నా ఫర్ ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లైతే

విశ్వక్ సేన్ ది దాదాపుగా సినిమా ప్రతి ఫ్రేములో కనిపించే పాత్ర అద్భుతం గా చేసాడు. ఒక సైకలాజికల్ ట్రామా కి గురైన వ్యక్తి లా మంచి నటన ప్రదర్శించాడు. హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అయినా గానీ హీరోయిన్ కనిపించేది తక్కువే కనుక రుహాని శర్మ కి పెద్ద స్కోప్ లేదు. హరితేజ కి తన కెరీర్ లో బహుశా నటన కు ఎక్కువ అవకాశమున్న పాత్ర చేసింది. మురళీశర్మ ది కీలక పాత్ర అయినా నిడివి తక్కువగా ఉన్న పాత్ర. సీనియర్ నటుడు భానుచందర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. హీరో పక్కన ఉండే పాత్రలు వాళ్ళ వాళ్ళ పరిధిలో బాగానే చేశారు.


తెర వెనుక కథ

టెక్నీషన్స్ విషయం లో ఎక్కువగా చెప్పుకోవాల్సింది వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని సౌండ్స్ తో స్క్రీన్ ప్లే ని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ అందించారు. మణికందన్ ఫోటొగ్రఫీ దానికి తోడయ్యింది. గ్యారీ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఇక దర్శకుడు శైలేష్ కొలను తొలి సినిమా తో 'హిట్' కొట్టాడు. కథ, కథనం బాగుంది. క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ అయ్యాక కొంచెం స్లో అయినట్లుగా అనిపించినా తన తీయబోయే HIT second case కి లీడ్ సీన్ లా అనుకోవచ్చు. వాల్ పోస్టర్ సినిమా, నాని ఒక మంచి దర్శకున్ని పరిచయం చేసారని చెప్పుకోవచ్చు.

On the Whole, HIT First Case is a “HIT” that will make you curious about its second case.

Watch out HIT Movie Review
https://www.youtube.com/watch?v=VHpx4FTEboU&t=1s


Recent News