Seasons Greetings
user-icon Sign In
Go Back

9years Of Mr.Perfect

రవి కుమార్ వెల్దండి | Apr-21-2020
9years-Of-Mr.Perfect

తెలుగు సినిమా కథల్లో ప్రేమ, పగ, సెంటిమెంటు ఇలాంటి  మూస కథలు కాకుండా కొంత మనస్తత్వాలను విశ్లేషించే కథలు, క్యారక్టరైజేషన్ కి ప్రాధాన్యతను ఇస్తూ, పాత్ర ఔచిత్యాన్ని, కథాగమనం లో పాత్ర నడవడి లో మార్పుని, పాత్ర సంఘర్ష్నణ ని తెర మీద ఆవిష్కృతం చేసిన కథలు కూడా అరుదుగా వస్తూ ఉంటాయి. డార్లింగ్ ప్రభాస్ నటించిన Mr. ఫర్ ఫెక్ట్ అలాంటి సినిమానే. దోసిలిని ఎంత దగ్గరికి ముడుచుకుని అడ్జస్ట్ చేసుకుంటే అన్ని ఎక్కువ నీళ్ళు ఎలా ఒడిసి పట్టుకోవచ్చో అలాగే లైఫ్ లో ఎంత అడ్జస్ట్ అయితే అంత ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు ఉంటారు అని అనే పాయింట్ ఆధారంగా అల్లిన కథ.

 

అడ్జస్ట్ అయితే ఓడిపోతాం అనుకునే యూత్ ఆటిట్యూడ్ తో గెలవడమే లైఫ్ అని నమ్మే యువతరానికి, అడ్జస్ట్ అవకపోతే గెలవలేము అని చెప్పే ఓల్డ్ ఆటిట్యూడ్ అనుభవంతో కూడిన పాత తరానికి మధ్య ఎప్పుడూ ఉండే వాదనని, ఇద్దరి మధ్య ఒక ఛాలెంజ్ రూపం లో చూపించే ప్రయత్నం చేసిన సినిమా Mr. ఫర్ ఫెక్ట్. 

 

ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండటం జరగదని, ఏ ఇద్దరూ ఒకేలా ఉన్నా వాళ్ళు సెలెక్టెడ్ ఫర్  మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు వాళ్ళు రిజెక్ట్ అయినట్టు అని చెప్తూ అభిప్రాయాలు కలిస్తే ప్రేమ కాదు మనసులు కలిస్తే ప్రేమ అని చెప్పిన సినిమా Mr. ఫర్ ఫెక్ట్.  

 

ప్రేమంటే మనకు నచ్చడం కాదు, ఎదుటి వాళ్ళకి నచ్చేలా మనల్ని మార్చుకోవడం అని,ప్రేమ వున్న చోట అడ్జస్ట్ మెంట్ అన్న మాటే ఉండదని, ఇద్దరు వ్యక్తులు దగ్గరవాలంటే ఎవరో ఒకరు స్థానం మారాల్సిందే అని, పెళ్ళి అంటే ఇద్దరు ఫర్ ఫెక్ట్ మనుషుల మధ్య జరిగేది కాదు, ఒకరికొకరు ఫర్ ఫెక్ట్ అవడం అని చెప్పిన సినిమా Mr. ఫర్ ఫెక్ట్.

 

ఉప్పు, నిప్పులా ఎప్పటికీ కొట్టుకుంటూ ఉండే వాళ్ళు కలిసి ఉండటం ఎందుకు? విడిపోయి కలిసి ఉండొచ్చు కదా అనే కొత్త తరం సొల్యూషన్ కి కలిసి ఉండటం వల్ల ఉండే లాభాలు, ఆత్మీయుల మధ్య అనుబంధాలు గట్టి పడితే ఉండే సంతోషాల విలువను తెలిపిన సినిమా Mr. ఫర్ ఫెక్ట్.

 

పాయింట్, ప్లాట్ కొంచెం సీరియస్ ది అయినా బ్రహ్మానందం తో పాటుగా మిగిలిన పాత్రలు పండించిన హాస్యం, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, Mr. ఫర్ ఫెక్ట్ సినిమాని ఒక ఫర్ ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా చేసాయి.మనకి నచ్చింది చేస్తే ఇంతే ఆనందం నలుగురికి నచ్చింది చేస్తే ఎంతో ఆనందం అని చెప్పిన  Mr. ఫర్ ఫెక్ట్ సినిమాకి నేటికి తొమ్మిదేళ్ళు. 

 


Tags: Prabhas ,Dil Raju

Recent News